Pushpa 2 Journey : సుక్కు, బన్నీ, రష్మిక, తబిత.. అందరూ ఎమోషనల్.. పుష్ప అయిదేళ్ల జర్నీ ముగుస్తుండటంతో..
ఆల్మోస్ట్ మూవీ టీమ్ ఎవరూ మారకుండా అందరూ ఐదేళ్లు ఈ రెండు సినిమాలకు పనిచేసారు. అయిదేళ్ల జర్నీ రేపు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో పూర్తికాబోతుంది.

Allu Arjun Sukumar Rashmika Pushpa 2 Team got Emotional for Completing 5 Years of Pushpa Journey
Pushpa 2 Journey : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పుష్ప పార్ట్ 1 సినిమా 2020 లో మొదలుపెట్టారు. అప్పట్నుంచి పుష్ప జర్నీ మొదలయింది. అయిదేళ్లుగా ఈ జర్నీ కొనసాగింది. ఆల్మోస్ట్ మూవీ టీమ్ ఎవరూ మారకుండా అందరూ ఐదేళ్లు ఈ రెండు సినిమాలకు పనిచేసారు. అయిదేళ్ల జర్నీ రేపు డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో పూర్తికాబోతుంది.
దీంతో నిన్న జరిగిన హైదరాబాద్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ బన్నీతో ఉన్న రిలేషన్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ మాటలకు అల్లు అర్జున్ కూడా ఏడ్చేసాడు. ఇటీవల ముంబై ఈవెంట్లో కూడా రష్మిక మాట్లాడుతూ ఏడేళ్ల తన కెరీర్ లో ఐదేళ్లు ఈ సినిమాకే ఇచ్చాను అంటూ ఎమోషనల్ అయింది. ఎమోషనల్ గా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది పుష్ప సినిమా గురించి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ గురించి వీడియో వేయగా అది చూస్తూ సుకుమార్ భార్య తబిత కూడా ఏడ్చేసింది. ఇలా సినిమాలో మెయిన్ వాళ్ళే ఎమోషనల్ అవ్వడంతో ఈ ఈవెంట్ స్పెషల్ గా మారింది.
Also Read : Allu Arjun : అయిదేళ్ల తర్వాత బన్నీ గడ్డం తీసెయ్యబోతున్నాడా? ముందు కూతురి కోసమే..
అయిదేళ్లుగా వీరంతా కలిసి ఒకే సినిమాకు వర్క్ చేయడం, ఒక మంచి జర్నీ చేయడంతో వీరందరి మధ్య బాండింగ్ ఏర్పడి ఇప్పుడు సినిమా రిలీజయి తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అవుతారని తెలిసి ఈ ఈవెంట్లోనే ఎమోషనల్ అయ్యారు. దీంతో వీళ్ళు ఎమోషనల్ అయిన వీడియోలు, ఫోటోలు నిన్నటి నుచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బన్నీ, రష్మిక కూడా ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతలా వాళ్లందరికీ కనెక్ట్ అయిన ఈ సినిమా పెద్ద హిట్ అయి వాళ్ళ కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్, ప్రేక్షకులు భావిస్తున్నారు.