Allu Arjun : అయిదేళ్ల తర్వాత బన్నీ గడ్డం తీసెయ్యబోతున్నాడా? ముందు కూతురి కోసమే..
అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీయక ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పూర్తవబోతుంది.

Allu Arjun Removing his Beard very Soon after 5 years of Pushpa Journey
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. పుష్ప 1 మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆల్మోస్ట్ అయిదేళ్ల ప్రయాణం ఇది. 2020లో అలవైకుంఠపురంలో సినిమా తర్వాత నుంచి తన పూర్తి సమయం పుష్ప సినిమాకే కేటాయించాడు. అలవైకుంఠపురం సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత నుంచి బన్నీ పుష్ప సినిమాకు వర్క్ చేస్తున్నాడు.
అలవైకుంఠపురం సినిమాలో ఆల్మోస్ట్ క్లీన్ షేవ్, రఫ్ లుక్ లో కనపడి అలరించాడు బన్నీ. ఆ సినిమా తర్వాత నుంచి పుష్ప సినిమా కోసం గడ్డం పెంచడం మొదలుపెట్టాడు. పుష్ప కోసం మొదటిసారి బన్నీ ఫుల్ మాస్ లుక్ లో గడ్డం పెంచాడు. సినిమాలో లుక్ కి తగ్గట్టు అప్పుడప్పుడు కొంత కట్ చేస్తూ ఆ ఫుల్ గడ్డాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ఎఫెక్ట్ క్రిస్మస్ సినిమాలపై పడుతుందా? ఈ ఇయర్ ఎండింగ్ కష్టమేనా?
అల్లు అర్జున్ పూర్తిగా గడ్డం తీయక ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పూర్తవబోతుంది. అల్లు అర్జున్ కి ఫుల్ గడ్డంతో ఈ మాస్ లుక్ కూడా అదిరిపోయింది. పుష్ప 2లో కూడా ఈ మాస్ లుక్ తో గడ్డంతోనే పవర్ఫుల్ గా కనిపించాడు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా గడ్డం తీయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల పుష్ప ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా కూతురు నా దగ్గరికి వచ్చేది కూడా కాదు. ఆల్మోస్ట్ నాలుగేళ్ళ నుంచి నేను తనని ప్రేమగా కిస్ కూడా చేసుకోలేకపోయాను ఈ గడ్డం వల్ల. అందుకే నేను ఎప్పుడెప్పుడు ఈ గడ్డం తీసేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజయిన కొన్ని రోజులకే అల్లు అర్జున్ గడ్డం తీసేయబోతున్నాడని తెలుస్తుంది. ముందు తన కూతురి మీద ఉన్న ప్రేమతోనే గడ్డం తీసేస్తున్నాడని బన్నీ మాటల్లో అర్ధమవుతుంది. మరి ఇన్నేళ్లు గడ్డంలో కనిపించిన బన్నీ సడెన్ గా తీసేస్తే ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.