Pushpa 2 : పుష్ప 2 ఎఫెక్ట్ క్రిస్మస్ సినిమాలపై పడుతుందా? ఈ ఇయర్ ఎండింగ్ కష్టమేనా?
పుష్ప 2 టికెట్ రేట్ల పై సాధారణ ప్రేక్షకులలో చర్చ జరుగుతుంది.

Pushpa 2 Movie Ticket Price Effecting on Other December Movies
Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో ఒక్కో టికెట్ ధర 1100 నుంచి 1200 వరకు ఉంది. ఇక బెనిఫిట్ షోలు, మొదటి నాలుగు రోజులు 350 నుంచి 500 పైనే ఉన్నాయి టికెట్ ధరలు. ఫ్యాన్స్ ఈ రేట్లతో సినిమా చూసినా ఫ్యామిలీలు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. ఒక ఫ్యామిలీలో కనీసం నలుగురు ఉన్నా నలుగురు సినిమాకు వెళ్తే 2000 ఈజీగా అయిపోతాయి. దీంతో పుష్ప 2 టికెట్ రేట్ల పై సాధారణ ప్రేక్షకులలో చర్చ జరుగుతుంది.
ఒకవేళ అందరూ పుష్ప 2 సినిమాకు ఇంతేసి టికెట్ రేట్లు పెట్టుకొని వెళ్తే ఈ నెలలో తర్వాత వచ్చే సినిమాలకు మళ్ళీ కష్టమే. ఒక ఫ్యామిలీ అయినా యూత్ అయినా ఇప్పుడు 2000 ఒక్క సినిమాకే ఖర్చుపెడితే తర్వాత వచ్చే సినిమాలకు డబ్బులు పెట్టి చూస్తారా అనేది సందేహమే. ఈ నెలలో పుష్ప తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు అల్లరి నరేష్ బచ్చలమల్లి, ప్రియదర్శి సారంగపాణి జాతకం, ఉపేంద్ర UI, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవి కాక చిన్న సినిమాలు మరో అరడజను ఉన్నాయి.
Also Read : Pushpa 2 Ticket Price : పుష్ప 2 సినిమా టికెట్ రేట్లపై హైకోర్ట్ సీరియస్…
చిన్న సినిమాలు పక్కన పెట్టినా నితిన్, అల్లరి నరేష్ సినిమాలు చూద్దామనుకున్నా మళ్ళీ వాటి టికెట్ ధర కనీసం 200 నుంచి ఉంటుంది. ఆ టైంకి ఫ్యామిలీతో వెళ్లాలంటే 1000 రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. అసలే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. ఆ హాలిడేస్ లో సినిమాలు ప్రిఫర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఇప్పుడు పుష్ప సినిమాకు ఇంత ఖర్చుపెట్టి మళ్ళీ అది కూడా నెలాఖరున సినిమాలకు వెళ్తారా అనేది పెద్ద సందేహమే. దీంతో పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు ఈ నెలలో వచ్చే మిగిలిన సినిమాల కలెక్షన్స్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు.