China Piece : ‘చైనా పీస్’ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ చూశారా.. ఫాల్గుణి స్పెషల్ డ్యాన్స్..

తాజాగా చైనా పీస్ సినిమా నుంచి 'ఇదేంటో జేమ్స్ బాండ్..' అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. (China Piece)

China Piece : ‘చైనా పీస్’ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ చూశారా.. ఫాల్గుణి స్పెషల్ డ్యాన్స్..

China Piece

Updated On : October 29, 2025 / 9:29 PM IST

China Piece : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై డ్రామా సినిమా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.(China Piece)

తాజాగా చైనా పీస్ సినిమా నుంచి ‘ఇదేంటో జేమ్స్ బాండ్..’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీత దర్శకత్వంలో దినేష్ కాకర్ల ఈ పాటను రాయగా స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ పాడారు. ఈ పాటలో డ్యాన్సర్ ఫాల్గుణి స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి.

Also Read : Bhanu Bhogavarapu : ఆరున్నర కోట్లతో సెట్.. వెంకీ, ఇడియట్ రిఫరెన్స్ లు.. హీరోకి గాయాలు.. మాస్ జాతర గురించి డైరెక్టర్ ముచ్చట్లు..