Bhanu Bhogavarapu : ఆరున్నర కోట్లతో సెట్.. వెంకీ, ఇడియట్ రిఫరెన్స్ లు.. హీరోకి గాయాలు.. మాస్ జాతర గురించి డైరెక్టర్ ముచ్చట్లు..

మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ భాను భోగవరపు నేడు మీడియాతో మాట్లాడారు.(Bhanu Bhogavarapu)

Bhanu Bhogavarapu : ఆరున్నర కోట్లతో సెట్.. వెంకీ, ఇడియట్ రిఫరెన్స్ లు.. హీరోకి గాయాలు.. మాస్ జాతర గురించి డైరెక్టర్ ముచ్చట్లు..

Bhanu Bhogavarapu

Updated On : October 29, 2025 / 9:18 PM IST

Bhanu Bhogavarapu : మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమాగా మాస్ జాతరతో రాబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మాస్ జాతర సినిమా నవంబర్ 1 న రిలీజ్ అవుతుండగా అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ వేస్తున్నారు. మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ భాను భోగవరపు నేడు మీడియాతో మాట్లాడారు.(Bhanu Bhogavarapu)

మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మాస్ అంశాలతో పాటు ఓ కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. మాస్ జాతర అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. థియేటర్ లో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఇది కల్పిత కథే అయినా ఈ కథ కోసం పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నాను అని తెలిపారు.

Also Read : Baahubali : బాహుబలి 3 అనౌన్స్.. టైటిల్, బడ్జెట్ చెప్పేసిన రాజమౌళి.. కానీ మాములు సినిమా కాదు.. ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్

నవీన్ చంద్ర విలన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. శివుడు అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కాపాడతారు నవీన్ చంద్ర. మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటులను అనుకున్నాము కానీ వాళ్ళతో సంతృప్తి చెందక నవీన్ చంద్ర గారిని తీసుకున్నాము. ఆ పాత్ర కోసం నవీన్ చంద్రకు స్పెషల్ మేకోవర్ చేసాము. సినిమా అరిలిజ్ తర్వాత అంతా ఆ పాత్ర గురించే మాట్లాడతారు అని తెలిపారు. శ్రీలీల గురించి మాట్లాడుతూ.. ఈ కథ మొదలయినప్పటి నుంచి శ్రీలీలే అనుకున్నాము. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి – విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలా మాస్ టచ్ తో కామెడీగా అంతాయో ఇందులో రవితేజ – శ్రీలీల మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయి అని అన్నారు.

రవితేజ గురించి మాట్లాడుతూ.. నేను రొమాంటిక్ కామెడీ సినిమాతోనే దర్శకుడిగా మారదాం అనుకున్నా. కానీ అందరూ మాస్ కథే అడగడంతో ఈ కథ రాసుకున్నా. ఈ కథ రాసేటప్పుడు రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను. ఆయన ఆల్రెడీ పోలీస్ పాత్రలు చేశారు కాబట్టి రైల్వే పోలీస్ కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఆయన పోలీస్ గా చేస్తే సినిమాలు హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశాను. సినిమాలో వెంకీ, ఇడియట్ సినిమాల రిఫరెన్స్ లు పెట్టాను. అవి ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం రవితేజ గారు బాగా కహ్టపడ్డారు. రెండు సార్లు గాయాలు అయ్యాయి. ఓ సారి చేతికి, ఓ సారి కాలికి గాయాలు అయ్యాయి. అందుకే షూటింగ్ కి గ్యాప్ వచ్చి సినిమా లేట్ అయింది అని తెలిపారు.

Also Read : Baahubali The Epic : ‘బాహుబలి ఎపిక్’ ఫైనల్ రన్ టైం ఎంతో తెలుసా? ఏమేం కట్ చేశారు? ఆ ట్రాక్ మొత్తం తీసేసారుగా..

అలాగే ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ అడగ్గానే ఆరున్నర కోట్లతో రైల్వే స్టేషన్ సెట్ వేయించారు. జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. నా లాంటి కొత్త దర్శకుడికి ఏం అడిగినా సపోర్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు భాను భోగవరపు.