Niharika : ఆ సమయంలో నిహారికకు హెల్త్ బాగోకపోయినా.. సినిమా కోసం..

నిర్మాతగా పలు సిరీస్ లు నిర్మించిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మొదటి థియేట్రికల్ సినిమా నిర్మించింది.

Niharika Konidela Hard work for Movie even her Health Not Supported

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారి ఆ తర్వాత నిర్మాతగా మారింది. నిర్మాతగా పలు సిరీస్ లు నిర్మించిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మొదటి థియేట్రికల్ సినిమా నిర్మించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఏకంగా 50 రోజులు ఆడింది. దీంతో తాజాగా 50 రోజుల వేడుక నిర్వహించారు.

Also Read : Nagababu : చిన్నప్పుడు ఆ విషయంలో ఫ్రెండ్స్ ని భలే మోసం చేసిన నాగబాబు..

కమిటీ కుర్రాళ్ళు 50 రోజుల వేడుకలో డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ కోసం అందరం కలిసి కొన్ని ఊర్లకు టూర్ వేసాము. నిహారిక గారు ఆ సమయంలో చాలా అనారోగ్యంగా ఉన్నారు. కానీ వీళ్ళందర్నీ కూడా తీసుకెళ్లారు. నేను అడిగేవాడ్ని హెల్త్ బాగోలేదు, ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు కాకపోతే వీళ్ళందర్నీ ఎవరు తీసుకెళ్తారు అనేవాళ్ళు. పది రోజులు ఒక బస్, వెనక ఒక కార్ తో ట్రావెల్ చేసాము. ఆవిడ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నా మా అందర్నీ ముందుండి నడిపించింది. సినిమా కోసం, సినిమా ప్రమోషన్స్ కోసం అంత కష్టపడ్డారు అని తెలిపారు.