Nagababu : చిన్నప్పుడు ఆ విషయంలో ఫ్రెండ్స్ ని భలే మోసం చేసిన నాగబాబు..
కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ తమ చిన్ననాటి విషయాలు కూడా కొన్ని పంచుకున్నారు.

Nagababu
Nagababu : మెగా బ్రదర్ నాగబాబు గతంలో నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజీ అయ్యారు. చాలా రోజుల తర్వాత నాగబాబు సినీ మీడియా ముందుకు వచ్చారు.
నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు సినిమా నిర్మించింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా 50 రోజుల వేడుకకు నాగబాబు గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తమ చిన్ననాటి విషయాలు కూడా కొన్ని పంచుకున్నారు.
Also Read : NTR – Devara : అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. ‘దేవర’ సక్సెస్ మీట్ అయినా పెడతారా?
ఈ క్రమంలో నాగబాబు మాట్లాడుతూ.. చిన్నప్పుడు సినిమాలకు బాగానే వెళ్ళేవాళ్ళం. నెల్లూరులో లీలామహల్ అనే థియేటర్ ఉండేది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం. కొన్ని అసలు అర్ధం అయ్యేవి కావు, చాలా చెండాలంగా ఉండేవి. సినిమాకు వెళ్లని మా ఫ్రెండ్స్ మమ్మల్ని అడిగితే మేము దొరికేశాము కదా, వీళ్ళు ఎందుకు మిస్ అవ్వాలి అని సూపర్ ఉంది సినిమా, అసలు మిస్ అవ్వకు, గొప్పగా ఉంది సినిమా అని చెప్పి ఇరికించేవాళ్ళం అని నవ్వుతూ ఆ రోజుల గురించి తెలిపారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో నాగబాబు వాళ్ళ ఫ్రెండ్స్ ని భలే మోసం చేసాడే అని అంటున్నారు నెటిజన్లు.