‘నిజమేనా’ లిరికల్ సాంగ్

రీసెంట్‌గా సీత మూవీ నుండి 'నిజమేనా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 13, 2019 / 12:21 PM IST
‘నిజమేనా’ లిరికల్ సాంగ్

Updated On : May 13, 2019 / 12:21 PM IST

రీసెంట్‌గా సీత మూవీ నుండి ‘నిజమేనా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌జంటగా.. తేజ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ.. సీత.. ATV సమర్పణలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్  బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సీత థియేట్రికల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ‘నిజమేనా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ‘ఎవరది ఎవరది ఎదగదిలో.. తలపుల తలుపులు తెరచినదీ.. నిజమేనా, నిజమేనా.. వెతికే ప్రాణమే ఎదురైనదా’.. అనే ఈ పాటకు లక్ష్మీ భూపాల్ లిరిక్స్ రాసాడు.

అనూప్ రూబెన్స్ కంపోజిషన్‌కు తగ్గట్టు అనురాగ్ కులకర్ణి పాడాడు. మే 24న సీత రిలీజవనుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు : లక్ష్మీ భూపాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.

వాచ్ లిరికల్ సాంగ్..