చివరి షెడ్యూల్‌లో : నిను వీడ‌ని నీడ‌ను నేనే

తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 06:26 AM IST
చివరి షెడ్యూల్‌లో : నిను వీడ‌ని నీడ‌ను నేనే

Updated On : January 22, 2019 / 6:26 AM IST

తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే పాయింట్‌. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనే కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. ఎమోషనల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు.

 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివరి ద‌శ‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్తో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిష‌న్ తొలిసారి న‌టిస్తోన్న హార‌ర్ చిత్రమిది.

 

ఇది ఒక వ్యక్తి తన సొంత నీడతో పోరాడుతున్న కథ. ఇలాంటి ఎంటర్టైనర్ సినిమాను గతంలో ఎన్నడూ చుసి ఉండరూ. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నాం. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నాం దీంతో సినిమా పూర్తవుతుంది’ అన్నారు.