నిశ్శబ్ధం : ప్రీ-టీజర్.. అనుష్క బర్త్‌డేకి టీజర్
దీపావళి సందర్భంగా ఆర్.మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ప్రీ-టీజర్ విడుదల చేశారు..

దీపావళి సందర్భంగా ఆర్.మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ ప్రీ-టీజర్ విడుదల చేశారు..
విలక్షణ నటుడు ఆర్.మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫస్ట్ సౌత్ హాలీవుడ్ క్రాస్ఓవర్ ఫిలిం.. ‘నిశ్శబ్దం’.. (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలిసి వర్క్ చెయ్యడాన్ని క్రాస్ఓవర్ అంటారు).. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై.. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన అనుష్క, మాధవన్ లుక్స్‌కి మంచి స్పందన వచ్చింది. దీపావళి సందర్భంగా ‘నిశ్శబ్దం’ ప్రీ-టీజర్ విడుదల చేశారు. మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. మాధవన్ వయోలిన్ ప్లే చేయడం, అనుష్క చేతి వేళ్లు మాత్రమే ప్రీ-టీజర్లో చూపించారు. నవంబర్ 7న అనుష్క బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు..
Read Also : అశ్వథ్థామ : టైటిల్ లుక్
తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ‘కిల్ బిల్’ మూవీలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ లేదా 2020 జనవరిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.