Nithiin : అల్లు అర్జున్ ‘ఐకాన్’ ఆగిపోయిందా.. ఆ సినిమా నితిన్ చేస్తున్నాడా..

గతంలో అల్లు అర్జున్ తో ప్రకటించిన ఐకాన్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఆ మూవీని దర్శకుడు వేణు శ్రీరామ్ నితిన్ తో తీస్తున్నాడట.

Nithiin next movie with Venu Sriram Allu Arjun Icon story line

Nithiin : టాలీవుడ్ హీరో నితిన్ కి 2020లో వచ్చిన ‘భీష్మ’ హిట్ తరువాత ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. భీష్మ తరువాత 4 సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాలో నటిస్తున్నాడు. ఒక వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతుంటే.. భీష్మతో తనకి సూపర్ హిట్టుని అందించిన వెంకీ కుడుములతో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా మరో మూవీకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘వకీల్ సాబ్’కి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్‌.. నితిన్ కి ఒక కథ చెప్పాడట.

Narendra Modi : అమెరికా పర్యటనలో ‘నాటు నాటు’ గురించి మోదీ వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

వేణు శ్రీరామ్‌ చెప్పిన స్టోరీ లైన్ నితిన్ కి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీని ఆగష్టులో మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కథ అల్లు అర్జున్‌ది అంటూ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. గతంలో వేణు శ్రీరామ్‌, అల్లు అర్జున్ తో (Allu Arjun) ‘ఐకాన్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఆ చిత్రంలో అల్లు అర్జున్.. అంధుడిగా కనిపించబోతున్నాడని వార్తలు రావడంతో ఆ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే ఏమైందో తెలియదు గాని ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు.

Adipurush : ఆదిపురుష్ చూడటానికి.. జపాన్ నుంచి సింగపూర్‌కి వచ్చిన ప్రభాస్ మహిళా అభిమాని..

ఇప్పుడు అదే కథలో కొన్ని మార్పులు చేసి వేణు శ్రీరామ్‌, నితిన్ తో సినిమా తియ్యబోతున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా నితిన్.. వక్కంతం వంశీతో చేస్తున్న సినిమా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో నితిన్ గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక వెంకీ కుదుమల్ సినిమా విషయానికి వస్తే.. అడ్వెంచర్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కబోతుందని చెబుతున్నారు.