Nithiin Robinhood movie ticket prices hike in AP
నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రను పోషించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్లలో ఒక్కొ టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్‌లో ఒక్కొ టికెట్ పై రూ.75ను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు జీవోను జారీ చేసింది. జీవో ప్రకారం 7 రోజుల పాటు ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలను పోషిస్తున్నారు.