Extra Ordinary Man Trailer : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్‌ని కొడతారంటగా..

వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Nithiin Sreeleela Extra Ordinary Man Trailer released

Extra Ordinary Man Trailer : ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్లాప్ తరువాత టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటూ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల టీజర్ తో మూవీ ఎలా ఉండబోతుందో ఒక సాంపిల్ చూపించిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని అర్ధమవుతుంది. ఈ మూవీలో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ని కొడతారంటగా అని ప్రశ్నించడం, పొన్నియిన్ సెల్వన్ కావ్యంగా ఉంది అర్ధం కాలేదు అనడం.. ఇలా సినిమా వ్యక్తులు, సినిమా గురించి మాట్లాడుతూ ఆడియన్స్ ని నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూవీలో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ఎండ్ లో రాజశేఖర్.. నాకు జీవితం, జీవిత రెండు ఒకటేలే అని చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Also read : Harom Hara Teaser : సుధీర్ బాబు పాన్ ఇండియా మూవీ కోసం ప్రభాస్.. ‘హరోంహర’ టీజర్ రిలీజ్..

సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బీష్మ’ సినిమా తరువాత నితిన్ కి ఒక్క హిట్టు కూడా లేదు. ఇక టెంపర్ సినిమా తరువాత వక్కంతం వంశీ కథలు అందించిన సినిమాలు హిట్ అవ్వలేదు. దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. మరి ఈ సినిమాతో హిట్టు కొట్టి ఈ ఇద్దరు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.