Robinhood Song : నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
రాబిన్ హుడ్ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో హాట్ హీరోయిన్ కేతికశర్మ చిందులేసింది. గ్లామరస్ లుక్ లో షార్ట్ స్కర్ట్ లో, మల్లెపూలు కప్పుకొని పాటలో హాట్ హాట్ గా స్టెప్పులతో అలరించింది. మీరు కూడా ఈ పాట వినేయండి..
అదిదా సర్‌ప్రైజ్.. అని సాగే ఈ సాంగ్ ని జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రాయగా నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసారు. ఈ పాట తర్వాత కేతిక శర్మకి మరిన్ని ఐటెం సాంగ్స్ ఆఫర్ వస్తాయేమో. ఇక రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది.