త్రివిక్రమ్ గారు ఐ మిస్ యు : నితిన్

  • Publish Date - August 28, 2019 / 06:49 AM IST

తివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్, సమంతా కలిసి నటించిన ‘అఆ’ సినిమాలోని ఇళ్లు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.  ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ మళ్లీ అదే ఇంట్లో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. 

ఈ సందర్భంగా ‘భీష్మ’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న నితిన్.. అఆ అంటూ ఒక్కసారి ఆ  జ్ఞాపకాలను తలచుకుంటూ ‘త్రివిక్రమ్‌ గారు ఐ మిస్‌ యు’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. నితిన్ ట్విట్ చూసి ‘అఆ’ టీం అంతా రిప్లే ఇచ్చారు. ఇక ఈ వీడియోలో నితిన్‌ ఫన్నీ ఎక్స్ ప్రేషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

అంతేకాదు నితిన్ ట్విట్ కు వెంకీ రిప్లే ఇస్తూ..అప్పుడు అసోసియేట్ డైరెక్టర్‌గా, ఇప్పుడు డైరెక్టర్‌గా ఒకే ఇంట్లో షూట్‌ చేయడం ఆనందంగా ఉంది. ‘థ్యాంక్యూ త్రివిక్రమ్‌ సర్‌’ అని నితిన్‌ ట్వీట్‌ కు రిప్లే ఇచ్చాడు. అఆ సినిమా నితిన్ కెరీర్ లోనే బిగ్ హిట్ కొట్టింది.