Nithin family En route Varun Lavanya Marriage in Bus
Nithin : వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి(Italy) చేరుకొని పెళ్లి పనుల్లో సందడిగా ఉన్నారు. ఈ పెళ్లి కేవలం వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వరుణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే జరుగుతుంది. ఇటలీలో మెగా, అల్లు, కామినేని ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీ సందడి చేస్తున్నాయి.
తాజాగా వరుణ్ పెళ్ళికి నితిన్ ఫ్యామిలీతో సహా బస్సు వేసుకొని వెళ్తున్నాడు. నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ షూట్ కోసం ఇటలీకి వెళ్ళాడు. అలాగే షూట్ అయ్యాక అక్కడే తన భార్య, అక్క, బావలతో ఇటలీ రోమ్ లో వెకేషన్ కి వెళ్ళాడు నితిన్. వీరితో పాటు ప్రముఖ డిజైనర్ నీరజ కోన కూడా ఉంది. దీంతో వీరంతా వరుణ్ పెళ్ళికి వెళ్తున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ లావణ్య పెళ్లి నవంబర్ 1న జరగనుంది.
Also Read : Bigg Boss 7 Day 57 : కావాలని అమర్ దీప్ ని టార్గెట్ చేస్తున్న శివాజీ బ్యాచ్.. నామినేషన్స్ లో గ్రూపుల గోల..
ఇటలీలో రోమ్ లో ఉన్న నితిన్ ఫ్యామిలీ ఓ బస్ మాట్లాడుకొని టుస్కానీకి వెళ్తున్నారు. బస్ ముందు నితిన్ ఫోటో దిగగా ఆ ఫోటోని నితిన్ బావ షేర్ చేసి వరుణ్ పెళ్లి పార్టీకి వెళ్తున్నాం అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా నితిన్ కూడా దానిని షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. వరుణ్ లావణ్య పెళ్ళిలో నితిన్ ఫ్యామిలీ కూడా సందడి చేయబోతున్నారు.