Bigg Boss 7 Day 57 : కావాలని అమర్ దీప్ ని టార్గెట్ చేస్తున్న శివాజీ బ్యాచ్.. నామినేషన్స్ లో గ్రూపుల గోల..
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.

Bigg Boss 7 Day 57 Highlights Nominations in House
Bigg Boss 7 Day 57 : బిగ్‌బాస్ లో ఆదివారం ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ కొత్త కెప్టెన్ అవ్వడంతో రతిక, శోభాశెట్టి వైస్ కెప్టెన్సీ అని అనౌన్స్ చేశాడు. అలాగే ఈ వారం హౌస్ లో ఉమెన్స్ వీక్ కావడంతో వారమంతా అమ్మాయిలకు విశ్రాంతి అని, అబ్బాయిలే పనులు చేయాలని ఆర్డర్ వేశాడు గౌతమ్. ఆ తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి.
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. సరైన కారణం చెప్పకపోవడంతో అమర్ దీప్ ప్రశాంత్ ని గ్రూప్ రాజకీయాలు అంటూ ఆడుకున్నాడు. అలాగే ప్రశాంత్ గత వారం కెప్టెన్సీ టాస్క్ లో మిర్చి దండ వేశాడని తేజని కూడా నామినేట్ చేశాడు. దీంతో తేజకి చిరాకు వచ్చి బిగ్‌బాస్ తో.. ఈ సారి నుంచి టాస్క్ లు ఇచ్చుకొని కెప్టెన్ ని మీరే ఎన్నుకోండి, ఇలాంటి పనులు మాకు చెప్పకండి అని అన్నాడు. ఇక ప్రియాంక.. రతికని ఆట కనపడలేదని నామినేట్ చేసింది. భోలేని నామినేట్ చేయగా ఎప్పటిలాగే మళ్ళీ భోలే, ప్రియాంక మధ్య గొడవ అయింది. అర్జున్.. శోభాశెట్టి, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు.
ఇక హౌస్ లో ఏం పని చేయకుండా, టాస్క్ లు ఆడకుండా బిల్డప్స్ ఇస్తూ, గ్రూప్ ఫామ్ చేసుకొని, తన గ్రూప్ వాళ్ళని వేరే వాళ్ళ మీదకు ఉసిగొల్పుతూ ఎంజాయ్ చేస్తున్న శివాజీ కూడా ఎలాంటి కారణం లేకుండానే అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. అడిగితే గతవారం నామినేషన్స్ లో గట్టిగా అరవడం నచ్చలేదు అన్నాడు. మరి ప్రశాంత్ కూడా అరిచాడు కదా, అతన్ని నామినేట్ చేయవు ఎందుకు అని అమర్ దీప్ అడగడంతో శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అలాగే శివాజీ.. తేజని కూడా నామినేట్ చేశాడు.
Also Read : Bigg Boss 7 Nominations : ఈ వారం నామినేషన్స్‌లో ఉంది వీరేనా..? మాటల యుద్ధం ఆగట్లేదుగా..!
ఇక తేజ.. అర్జున్, రతికలను నామినేట్ చేశాడు. భోలే ఎప్పటిలాగే ప్రియాంకను నామినేట్ చేసి గొడవ పెట్టుకున్నాడు. అలాగే భోలే శివాజీ గ్రూప్ కావడంతో అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. ఇలా శివాజీ బ్యాచ్ లోని ముగ్గురు ఊరికే అమర్ దీప్ ని నామినేట్ చేయడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకి పంపాలని బాగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సగం నామినేషన్స్ తో ఎపిసోడ్ ముగిసింది. మిగిలిన నామినేషన్స్ నేటి ఎపిసోడ్ లో ఉండనున్నాయి.