నితిన్ పెళ్లిచేసుకోబోయేది ఈమెనేనా?
యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోబేయేది ఈ అమ్మయినే అంటూ నెట్టింట్లో ఓ ఫోటో వైరల్ అవుతోంది..

యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోబేయేది ఈ అమ్మయినే అంటూ నెట్టింట్లో ఓ ఫోటో వైరల్ అవుతోంది..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. షాలిని అనే అమ్మాయిని నితిన్ వివాహం చేసుకోనున్నాడని, ఏప్రిల్‌లో వీరి వివాహం ఉంటుందని కొన్నాళ్ళుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా షాలినికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది.
నితిన్ పెళ్ళాడే అమ్మాయి ఈమే అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. నితిన్ బాబు క్లారిటీ ఇస్తేనే తప్ప ఇందులో నిజమెంత ఉందనేది క్లారిటీ రాదు.
ఇక రేపు (ఫిబ్రవరి 15) హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని మాత్రమే పిలిచారట.
ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
సినిమాల విషయానికొస్తే.. నితిన్, రష్మికతో నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ‘రంగ్ దే’, తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు నితిన్.