నితిన్ నిశ్చితార్దం: ముహుర్తం ఫిక్స్

జయం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నితిన్. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 17ఏళ్లైన నితిన్ త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్‌కు పెళ్లి ఫిక్స్ అయినట్లు.. ఏప్రిల్ 16న శాలిని అనే అమ్మాయితో నితిన్ ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15వ తేదీన నితిన్ నిశ్చితార్ధం జరగబోతుందట హైదరాబాద్‌లో.
యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారట. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు. పెళ్లి పనులన్నీ యువ నిర్మాత, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటుందట. ఈ మ్యారేజ్ డెస్టినేషన్ మ్యారేజ్‌గా కుటుంబ సభ్యులు చేయనున్నట్లు సమాచారం.
దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్ హోటల్‌లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్ ఇవ్వనున్నాడట. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.