Nithya Menen : సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానన్న స్టార్ హీరోయిన్ .. నేషనల్ అవార్డు రావడంతో..

నిత్యా మీనన్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తుంది.

Nithya Menen wants to leave Film Industry Shocking Comments goes Viral

Nithya Menen : కొంతమంది నటీనటులు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడో లేదా అవకాశాలు తగ్గినప్పుడో సినిమాలకు బ్రేక్ ఇవ్వడమో, సినిమాలు వదిలేయడమే చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ నిత్యా మీనన్ సినిమాలని వదిలేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. నిత్యా మీనన్ ప్రస్తుతం తమిళ్ లో జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ కానుంది.

Also Read : Nidhhi Agerwal : చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. నాకు సినిమాలకు దూరంగా వెళ్లిపోవాలని ఉంది. నా పర్సనాలిటికి ఈ యాక్టింగ్ అనేది డిఫరెంట్. నేను నార్మల్ లైఫ్ గడపాలని అనుకుంటాను. నేను పైలట్ అవ్వాలనుకునేదాన్ని. పైలట్ అయితే వరల్డ్ ట్రావెల్ చేయొచ్చు అని. నాకు నేచర్ ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం. ఇటీవల నేషనల్ అవార్డు రావడంతో నటిగా జీవితం పరిపూర్ణమైంది అనిపించింది. అందుకే ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ వరకు పూర్తిచేసి ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడ ఉన్నాను అని కూడా ఎవ్వరికి తెలియకూడదు. మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారు. ఈ విషయం మా నాన్నకు కూడా చెప్పాను అని తెలిపింది.

దీంతో నిత్యా మీనన్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ యాక్టింగ్ వదలద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిత్యా మీనన్ గతంలో తిరు సినిమా సమయంలో కూడా సినిమాలు వదిలేస్తాను అని చెప్పింది. ధనుష్, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన తిరు సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో నిత్య నటనకు గాను ఆమెకు నేషనల్ అవార్డు వచ్చింది.

Also Read : Hollywood : తగలబడుతున్న హాలీవుడ్.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా మంటల్లో..

కన్నడ, మలయాళం సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్ తెలుగులో నాని సరసన అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సంక్రాంతికి కాదలిక్క నేరమిల్లై సినిమాతో రాబోతుండగా ఆమె చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నట్టు సమాచారం. మరి నిజంగానే ఆ సినిమాలు పూర్తి చేసి సినిమా పరిశ్రమకు దూరమవుతుందా చూడాలి.