Nidhhi Agerwal : చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్..
హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Threatens to Nidhhi Agerwal Files Police Complaint
Nidhhi Agerwal : తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కు కొంతమంది చంపేస్తామని బెదిరింపులు పంపించారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ ని చంపేస్తానని కామెంట్స్ చేస్తున్నాడట. అలాగే తన ఫ్యామిలీ వ్యక్తులను కూడా టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారట. దీనిపై నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Hollywood : తగలబడుతున్న హాలీవుడ్.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా మంటల్లో..
హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో.. ఆ వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని, తనతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని, ఈ బెదిరింపుల వల్ల తను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాను అని ఫిర్యాదు చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. ఈ హీరోయిన్ ని బెదిరించే ఆ వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక నిధి అగర్వాల్ కెరీర్ విషయానికొస్తే ఓ హిందీ సినిమా చేసి తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తుంది. చివరగా నిధి అగర్వాల్ తెలుగులో 2022 లో హీరో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
Also Read : Gandhi Tatha Chettu : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైలర్ వచ్చేసింది..
ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్, పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరమే పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. ఈ సినిమాల తర్వాత నిధి అగర్వాల్ రేంజ్ పెరిగే అవకాశం ఉంది.