Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

‘అఖండ’ మూవీలోని ‘జై బాలయ్య’ పాటకు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నివేదా థామస్ అదిరిపోయే స్టెప్పులేసింది..

Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్

Nivetha Thomas

Nivetha Thomas: నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాలుగో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతూ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

Akhanda : 25వ రోజు.. అయినా ఆగని అరాచకం..

ఈ సినిమాలో బాలయ్య డ్యాన్స్ చెయ్యడానికి స్కోప్ ఉన్న ఒకే ఒక్క పాట ‘జై బాలయ్య’. చేయి ఫ్రాక్చర్ అయినా నొప్పి తట్టుకుని ఫ్యాన్స్ కోసం ఆ పాట చేసాడు బాలయ్య. సినిమా రిలీజ్‌కి ముందే సూపర్ హిట్ అయిపోయిందీ సాంగ్. పిల్లల దగ్గరినుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Akhanda Mass Jathara : బాక్సాఫీస్ బరిలో బాలయ్య మాస్ ర్యాంపేజ్!

రీసెంట్‌గా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నివేదా థామస్ ‘జై బాలయ్య’ పాటకు స్టెప్పులేసింది. ఈ సాంగ్‌లో బాలయ్య మూమెంట్ చేస్తుండగా షర్ట్స్ మారుతుంటాయి కదా ఆ స్టెప్పే వేసింది నివేదా. సరిగ్గా రెండు షర్టులు మారేసరికి సీన్ రివర్స్ అయింది. ఏదేమైనా ‘అఖండ’ ఎక్స్‌పీరియన్స్ అదిరిపోయిందంటూ వీడియో షేర్ చేసింది నివేదా థామస్.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)