Akhanda : 25వ రోజు.. అయినా ఆగని అరాచకం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా రిపీట్ ఆడియన్స్ ‘అఖండ’ కు బ్రహ్మరథం పడుతున్నారు..

Akhanda : 25వ రోజు.. అయినా ఆగని అరాచకం..

Akhanda

Updated On : December 26, 2021 / 4:13 PM IST

Akhanda: నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’ బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సరైన సాలిడ్ మాస్ బొమ్మ పడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందనేది ‘అఖండ’ మరోసారి నిరూపించింది.

Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..

డిసెంబర్ 2 నుండి తెలుగు ప్రేక్షకులు అసలు సిసలు మాస్ జాతరను చూస్తున్నారు. నాలుగవ వారంలోనూ మంచి వసూళ్లతో రచ్చ రంబోలా చేస్తున్నారు బాలయ్య. డిసెంబర్ 26 నాటికి ‘అఖండ’ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంటోంది. క్రిస్మస్ రోజు దాదాపు అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

Akhanda Mass Jathara : బాక్సాఫీస్ బరిలో బాలయ్య మాస్ ర్యాంపేజ్!

25వ రోజైన డిసెంబర్ 26న నెల్లూరులోని మూడు థియేటర్లలో రెండు థియేటర్లు ఫుల్ అవగా.. మూడో థియేటర్ 90 శాతం ఫుల్ అవడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా రిపీట్ ఆడియన్స్ ‘అఖండ’ కు బ్రహ్మరథం పడుతున్నారు.

Anil Ravipudi : ఏపీ థియేటర్స్ విషయంలో అయోమయంగా ఉంది..

నైజాంలో రూ. 20 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో రూ. 15 కోట్ల గ్రాస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్ల గ్రాస్, వరల్డ్‌వైడ్ రూ. 125 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 1 మిలియన్‌కి వసూళ్లతో పాటు మేజర్ సిటీల్లో ఇప్పటికీ చక్కటి కలెక్షన్లతో రన్ అవుతోంది ‘అఖండ’..

Nbk