Salaar Tickets : సలార్ సినిమా టికెట్స్ ఆన్లైన్లో లేనట్టే.. థియేటర్ దగ్గరే కొనుక్కోవాలి..

ఇప్పటికే సలార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని చోట్ల ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

No Online Ticket Bookings for Prabhas Salaar Movie Fans Disappointed

Salaar Tickets : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో సలార్ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రానుంది. అయితే సలార్ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ప్రమోషన్స్ చేయట్లేదని అభిమానులు నిరాశ చెందుతుంటే మరో పక్క ఆన్లైన్ బుకింగ్స్ కూడా లేవని షాక్ ఇచ్చారు చిత్రయూనిట్.

ఇప్పటికే సలార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని చోట్ల ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా నైజాం హక్కులను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సలార్ సినిమాతో థియేటర్స్ వద్ద పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించింది. అంటే సలార్ సినిమా టికెట్స్ నైజాం వరకు థియేటర్స్ వద్దే అమ్ముతారని, ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ ఉండవని సమాచారం. ఇది తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. పలువురు దీనిపై విమర్శలు చేస్తున్నారు.

థియేటర్స్ వద్దకు వెళ్లి లైన్స్ లో నించొని, కొట్టుకుంటూ, తోసుకుంటూ టికెట్స్ తీసుకోవాలా, బ్లాక్ లో కొనుక్కోవాలా అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆన్లైన్ టికెట్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఇలా థియేటర్ దగ్గర టికెట్స్ తీసుకోవడం కేవలం సింగిల్ స్క్రీన్స్ కి మాత్రమే అని, అది కూడా మొదటి రోజు లేదా మూడు రోజు మాత్రమే ఉండొచ్చు అని టాలీవుడ్ సమాచారం.

Also Read : Prashanth Neel : నాకు ఆ సమస్య ఉంది.. అందుకే నా సినిమాలన్నీ డార్క్ గా ఉంటాయి..

ఇక ఆంధ్రాలో కూడా ఇంకా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అయితే అక్కడ ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదు అనేది కారణం తెలీదు. కానీ రిలీజ్ ముందు రోజు ఆంధ్రాలో సలరా బుకింగ్స్ ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. మరి ఇలా థియేటర్స్ దగ్గర టికెట్స్ అమ్మితే కలెక్షన్స్ హై రేంజ్ లో వస్తాయా అని కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు.