ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్న ‘నో టైం టు డై’ – ట్రైలర్
జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ సినిమాగా తెరకెక్కుతున్న ‘నో టైం టు డై’ ట్రైలర్ రిలీజ్..

జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ సినిమాగా తెరకెక్కుతున్న ‘నో టైం టు డై’ ట్రైలర్ రిలీజ్..
వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ సినిమాగా తెరకెక్కుతున్న ‘నో టైం టు డై’ ట్రైలర్ రిలీజ్ అయింది. గత సినిమాల మాదిరిగానే మంచి థ్రిల్లింగ్ యాక్షన్ మరియు ఛేజింగ్ సీన్స్, గ్రాండియర్‌గా అదిరిపోయే విజువల్స్‌తో ఈ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. డానియల్ క్రెయిగ్ ఈ సినిమాలో బాండ్ పాత్రలో కనిపిస్తారు.
ఇదివరకు ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’, ‘స్పెక్ట్రీ’ సినిమాల్లో కూడా ఆయన బాండ్ పాత్రలో నటించి మెప్పించారు. మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రొకోలి నిర్మాతలుగా మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్యారీ జోజి ఫ్యూకునాగా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా బాండ్ లవర్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుందని అర్ధం అవుతోంది. రమి మాలెక్, రాల్ఫ్ ఫెన్నెస్, నయోమి హారిస్, రోరి కిన్నియెర్, లియా సెడౌక్స్ తదితరులు సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2020 ఏప్రిల్‌లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..