Noel Sean
Noel Sean : తెలుగులో ర్యాప్ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక పేరుని సంపాదించుకున్నాడు సింగర్ నోయల్. ఆ తర్వాత ర్యాప్ సింగర్‌గానే కాక వేరే పాటలు కూడా పాడాడు. యాక్టర్ గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు నోయల్. తనకున్న పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు సీజన్-3లో కంటెస్టెంట్‌గా కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫేమ్ సంపాదించాడు. తాజాగా నోయల్ ఇంట్లో విషాదం నెలకొంది.
NTR Farm House : జూనియర్ ఎన్టీఆర్ కోట్ల రూపాయల బృందావనం.. భార్యకి గిఫ్టుగా..
సింగర్ నోయల్ తండ్రి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. నోయెల్ తండ్రి మరణవార్త తెలిసి సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, పలువురు టాలీవుడ్ సింగర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు నోయల్ ఇంటికి వెళ్లి సంతాపం తెలుపుతున్నారు. అభిమానులు కూడా నోయల్ త్వరగా ఆ బాధ నుంచి బయటకి రావాలని కోరుకుంటూ నోయల్ తండ్రికి నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.