NTR Farm House : జూనియర్ ఎన్టీఆర్ కోట్ల రూపాయల బృందావనం.. భార్యకి గిఫ్టుగా..

తాజాగా ఎన్టీఆర్ కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ని తన భార్య ప్రణతికి గిఫ్ట్ గా ఇచ్చారట. గ‌త ఏడాది ఫామ్ హౌస్ కోసం హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భూములు కొన్నారు ఎన్టీఆర్‌. అప్ప‌టి నుంచి..............

NTR Farm House : జూనియర్ ఎన్టీఆర్ కోట్ల రూపాయల బృందావనం.. భార్యకి గిఫ్టుగా..

Ntr

NTR Farm House :  టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వరుస విజయాలతో ఉన్న సంగతి తెలిసిందే. తనని తాను మార్చుకొని టెంపర్ సినిమా నుంచి సరికొత్త సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇక ఇటీవల వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. తాజాగా ఎన్టీఆర్ కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ని తన భార్య ప్రణతికి గిఫ్ట్ గా ఇచ్చారట. గ‌త ఏడాది ఫామ్ హౌస్ కోసం హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో భూములు కొన్నారు ఎన్టీఆర్‌. అప్ప‌టి నుంచి ఫామ్ హౌస్‌ను కడుతున్నారు. ఇటీవలే ఆ ఫామ్ హౌస్ కట్టడం పూర్తయింది.

Tollywood : షూటింగ్స్ ఆపేస్తారా?? ఈ సారి నిర్మాతల వంతు..

తాజాగా ఆ ఫామ్ హౌస్ కి ‘బృందావ‌నం’ అనే పేరు పెట్టారట ఎన్టీఆర్. ఈ బృందావనాన్ని భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి గిఫ్ట్‌గా ఇచ్చార‌ని స‌మాచారం. తన తాతయ్య ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడుగా తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే త‌న కుమారులంద‌రికి కృష్ణ అనే వ‌చ్చేలాగానే పేర్లు పెట్టారు. కృష్ణుడు పెరిగిన ప్ర‌దేశం బృందావ‌నం కాబ‌ట్టి తార‌క్ కూడా త‌న ఇంటికి ఆ పేరు పెట్టారని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలకి సొంత ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరారు. 6.5 ఎకరాల్లో ఈ ఫామ్ హౌస్ ని కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత అందంగా నిర్మించారట. ఈ ఫామ్ హౌస్ ఫొటోలు ఎప్పుడు బయటకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.