Rrr
RRR: దర్శక ధీరుడు రాజమౌళి ఐదేళ్ల క్రితం బాహుబలి2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. బాహుబలి2 తర్వాత ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా బాహుబలి2 క్రియేట్ చేసిన అన్ని రికార్డులను బ్రేక్ చేయలేదు. స్టార్ హీరోల సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్టులు కొట్టిన పెద్ద సినిమాల రికార్డులను సైతం ఆ సినిమాల దర్శక నిర్మాతలు నాన్ బాహుబలి రికార్డులు అని వెల్లడించేవారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి ముందు వరకు ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డ్ అన్న మాటలు వాడేవాళ్లం.
RRR : కుప్పంలో తారక్, చెర్రీ అభిమానుల మధ్య గొడవ.. థియేటర్ వద్ద టికెట్లు చింపేసిన ఫ్యాన్స్
కానీ ‘బాహుబలి’ తర్వాత ఇండస్ట్రీ హిట్ అనే మాటలు పక్కనపెట్టేసి ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త మాట ఒకటి తెరపైకి వచ్చింది. బాహుబలి సృష్టించిన రికార్డులు వేరు.. మిగతా సినిమా రికార్డులు వేరు అన్నట్లు మేకర్స్ చూడటం మొదలైంది. అసాధారణ వసూళ్లు సాధించిన ఆ సినిమాతో వేరే చిత్రాలను పోల్చడానికి ఇబ్బందిగా మారి ఇలా నాన్ బాహుబలి రికార్డ్స్ అని ఒక పదాన్ని వాడేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు కొన్ని ప్రాంతాలలో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన ఓవరాల్ గా మాత్రం టచ్ చేయలేకపోయారు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..
అయితే.. ఇప్పుడు మళ్ళీ ఆ దర్శకుడే ఆ రికార్డ్స్ బద్దలు కొడతాడా?.. నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పదాన్ని చరిత్రలో కలిపేస్తాడా అనే చర్చ ఆసక్తి కరంగా మారింది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ వచ్చేసింది. అప్పుడు అదే బాహుబలి రికార్డులు సృష్టించిన రాజమౌళి దర్శకత్వంలో ఇప్పుడు తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉండబోతున్నాయని తెలుస్తోంది.
RRR: ఫాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు.. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే!
అప్పుడు ప్రభాస్ లాంటి ఒకే మాస్ హీరో ఉంటే.. ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఆ డోస్ డబుల్ అయింది. అసలే నాలుగేళ్ల నిరీక్షణ.. ఈ సమయంలో ఎక్కడా తగ్గని క్రేజ్.. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కు ఉన్న హైప్ అంతాఇంతా కాదు. టికెట్ రేట్లు కూడా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ కూడా లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ సులభంగానే కళ్లు చెదిరే రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇన్ని కారణాలతోనే నాన్ బాహుబలి రికార్డ్స్ అనేది ఇక చరిత్ర కలిసిపోయి కొత్తగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.