North beauty Meera Raj Getting Big movie offers in south cinema industry
Meera Raj: చూడచక్కని రూపం.. గుండె కోసే వలపు సోయగం.. స్క్రీనంతా తళుక్కుమంటూ చెలరేగిపోయే చలాకీదనం.. ఇవన్నీటికి రూపం ఇస్తే అదే హీరోయిన్ మీరా రాజ్(Meera Raj). నార్త్ నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మీరా రాజ్. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఆండ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మీరా. ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘సన్ ఆఫ్’. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్ వస్తోంది.
ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత కూడా మీరా రాజ్ కెరీర్ స్పీడ్‌గా మారుతోంది. తాజాగా ఆమెకు దక్కిన క్రేజీ ప్రాజెక్ట్ కాంచన 4. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది. రీసెంట్ గా ఈ ఆఫర్ గురించి మాట్లాడిన ఆమె.. “నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సినిమా కోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఈ నాలుగు లక్షణాల సమ్మేళనమే మీరా రాజ్. సౌత్ సినిమాల్లోకి ఉత్తరాది అమ్మాయిగా వచ్చి, “మన అమ్మాయే” అనిపించేలా నటించగలగడం అంత సులువు కాదు. కానీ మీరా రాజ్ తనకు అది సాధ్యమని నిరూపిస్తోంది. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీకి మరో రైజింగ్ స్టార్‌గా వచ్చేసినట్టే అంటున్నారు ఫ్యాన్స్.