NtrNeel: ఆగిపోయిన ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ వస్తున్న న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.
NTR and prashanth neel Dragon Movie Shoot Halted
- ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఆగిపోయింది
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
- స్వయంగా క్లారిటీ ఇచ్చిన మేకర్స్
NtrNeel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ఇంటర్నేషనల్ లెవల్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇటీవల డ్రాగన్ సినిమాపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయ్. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ విషయంలో గందరగోళం ఏర్పడిందని, అందుకే షూటింగ్ రద్దు అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.
Raaka: అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’.. అసలు ‘రాకా’ అంటే అర్థం ఏంటి? ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే?
అవన్నీ అవాస్తవాలని, షూటింగ్ రద్దు కాలేదని, కేవలం తదుపరి షెడ్యూల్ కోసం చిన్న ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, అనధికారిక సమాచారాన్ని నమ్మి రూమర్లను ప్రచారం చేయవద్దని మేకర్స్ అభిమానులను కోరారు. ఏవైనా అప్డేట్స్ ఉంటే స్వయంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
‘దేవర’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్(NtrNeel), సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
