NTR ANR Rare Cricket Video
NTR-ANR: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాలో.. స్టిక్ పట్టుకొని డ్రమ్స్ కొట్టడమే కాదు గ్రౌండ్‌లో బ్యాట్ పట్టుకొని సిక్స్‌లు కూడా కొడుతుంటాడు. టాలీవుడ్ క్రికెట్ టీంలో తమన్ మెయిన్ ప్లేయర్ ఉంటూ, అప్పుడపుడు చారిటీస్ కోసం నిర్వహించే మ్యాచ్‌ల్లో కూడా ఆడుతుంటాడు. తాజాగా గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తమన్ కొట్టిన షాట్ కి బాల్ పెవిలియన్ దాటి వెళ్లి పడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
NTR30: “NTR30” ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో వేగం పెంచిన కొరటాల..
దాదాపు 108 మీటర్లు భారీ సిక్స్ కొట్టడమే కాకుండా, 21 బాల్స్ లో 58 పరుగులు చేసి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఇక ఈ వీడియో ట్వీట్ వైరల్ కావడంతో.. నెట్టింట టాలీవుడ్ హీరోల క్రికెట్ ఆడే స్టైల్ గురించి చర్చ మొదలయింది. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆడుతున్న ఓల్డ్ రేర్ క్రికెట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
1978లో భారతీయ సినీపరిశ్రమలో ఒక చారిటీ మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్ లో అప్పటి అగ్ర కథానాయకులు నందమూరి తారక రామారావు , నాగేశ్వరరావు క్రికెట్ ఆడుతుండగా.. ఎన్టీఆర్ బాటింగ్ అదరగొడుతున్న వీడియోని నెటిజెన్ ఒకరు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ కుమార్ కూడా పాల్గొనగా అందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Classic ? #NTR #ANR playing cricket in 1978 #Telugu101 #crickettwitter pic.twitter.com/FkT3VAiwnc
— Telugu 101 (@Telugu101) November 7, 2022