Eshwar Harris : నేనే ఎన్టీఆర్ కి బాడీ డబుల్.. RRR సినిమాలో, ఆ యాడ్ లో నేనే చేశా.. వార్ 2 రిజెక్ట్ చేశా.. ఎవరితను..?

ఎన్టీఆర్ బాడీ డబల్ అని చెప్పే ఇతని పేరు ఈశ్వర్ హారిస్. తాజాగా ఈశ్వర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఇతను ఎన్టీఆర్ బాడీ డబుల్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

NTR Body Double Worked in RRR and Zepto Ad Eshwar Harris Comments goes Viral

Eshwar Harris : సాధారణంగా సినిమాల్లో హీరోలకు డూప్స్ ఉంటారు. వాళ్ళను బాడీ డబుల్స్ అని కూడా అంటారు. కొంతమందిని యాక్షన్ సీన్స్ కోసం వాడితే, కొంతమంది బాడీ డబుల్స్ ని మాత్రం చీటింగ్ సీన్స్ కోసం వాడతారు. అంటే ఫేస్ కనిపించకుండా ఉండే సీన్స్ లో ఈ బాడీ డబుల్స్ ని వాడతారు. తాజాగా ఓ నటుడు నేనే ఎన్టీఆర్ బాడీ డబుల్ అంటూ వైరల్ అవుతున్నాడు. తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి బాడీ డబుల్ గా చేసిన వర్క్స్ కూడా షేర్ చేయడం గమనార్హం.

ఎన్టీఆర్ బాడీ డబుల్ అని చెప్పే ఇతని పేరు ఈశ్వర్ హారిస్. తాజాగా ఈశ్వర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఇతను ఎన్టీఆర్ బాడీ డబుల్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : RJ Kajal : పహల్గాంలో బిగ్ బాస్ తెలుగు భామ.. నేను క్షేమం అంటూ వీడియో విడుదల చేసిన ఆర్జే కాజల్..

ఈశ్వర్ హారిస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరో పక్క పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్టీఆర్ కి బాడీ డబుల్ చేయడంతో ఇతని లైఫ్ టర్న్ అయిపోయిందట.

ఎన్టీఆర్ కి బాడీ డబుల్ చేయడం గురించి ఈశ్వర్ మాట్లాడుతూ.. నేను జూనియర్ ఎన్టీఆర్ కి RRR సినిమాలో, జెప్టో యాడ్ లో బాడీ డబుల్ చేశాను. నేను ఆచార్య సినిమాలో చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆ సినిమా షూట్ లో నన్ను కలిసి ఎన్టీఆర్ డూప్ లాగా ఉన్నాను అని, రాజమౌళి టీమ్ నీ గురించి వెతుకుతున్నారు అని చెప్పి RRR లో ఎన్టీఆర్ బాడీ డబుల్ ఛాన్స్ ఇప్పించాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ కి నాలుగు రోజులు బాడీ డబుల్ గా చేశాను. కొమురం భీముడొ సాంగ్ లో ఆయన ఫేస్ కనిపించనివి అన్ని నా షాట్స్. కాళ్ళు, చేతులు మీద రక్తం కారడం, రోప్ కట్టి లాగడం అవన్నీ నాతోనే చేశారు. ఇంటర్వెల్ ఫైట్ లో కూడా నేను ఉన్నాను. ఈ సినిమాలో స్టంట్స్ ఏమి చేయలేదు. ఎక్కువ చీటింగ్ షాట్స్ లో నన్ను పెట్టారు. నేను వాళ్లకు ముందే కనిపించి ఉంటే ఇంకా ఎక్కువ సీన్స్ లో చేసేవాడ్ని ఏమో అని తెలిపాడు.

Also Read : Raj Kasireddy : ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డి.. నిర్మాతగా సినిమాలు కూడా.. ఏమేం సినిమాలో తెలుసా?

అలాగే.. RRR సినిమా చేసేటప్పుడు ఎన్టీఆర్ ని నేను కలవలేదు. జెప్టో యాడ్ లోనే మొదటిసారి కలిసాను ఎన్టీఆర్ గారిని. RRR లో చేసానని తెలిసి ఈ యాడ్ కి పిలిచారు. ఆ రోజు ఎన్టీఆర్ 8 గంటలు టైం ఇచ్చారు. దాంతో కెమెరా, లైటింగ్ సెటింగ్స్ అన్ని నన్ను పెట్టి చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా పిలుస్తారు అని అనుకుంటున్నాను. వార్ 2 లో ఆఫర్ వచ్చింది కానీ రిజెక్ట్ చేశాను. రెమ్యునరేషన్ కుదరలేదు. ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా ఇచ్చేలా లేరు. మూడు రోజులు ముంబై రమ్మన్నారు కానీ వాళ్ళు ఇచ్చే బడ్జెట్ కి ఫ్లైట్ టికెట్స్ కూడా రావు. అందుకే చేయనని చెప్పాను అని తెలిపారు. ప్రస్తుతం పలు సినిమాల్లో, సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు వేస్తున్నాడు. ఎన్టీఆర్ కి బాడీ డబుల్ ఆఫర్ ఏ సినిమాకు వచ్చినా చేస్తానని తెలిపాడు.

 

Also Read : Nani – Vijay Deverakonda : ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతంలోనే.. నాని, విజయ్ దేవరకొండ సినిమాల షూటింగ్.. వాళ్ళేమన్నారంటే..