హీరోగా తారక్ బావమరిది!

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 03:27 PM IST
హీరోగా తారక్ బావమరిది!

Updated On : August 17, 2020 / 4:10 PM IST

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడా?.. నందమూరి తారక రామారావు వారసులు వారి వారసులు సినిమా రంగంలో కొనసాగుతుండగా.. నారా ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నారా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరో తనే..



ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి నితిన్ తమ్ముడు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు ఏకైక వారసుడు నితిన్.



ఓవైపు నటనలో శిక్షణ తీసుకుంటూనే కథలు కూడా వింటున్నాడట నితిన్. ఎన్టీఆర్ కూడా బావమరిదికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడట. త్వరలో నితిన్ ఎంట్రీ గురించి అధికారికంగా వెలువడించనున్నారని టాలీవుడ్ టాక్.