NTR
NTR : ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాతో రాగా ఆ సినిమా ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఎన్టీఆర్ కి ఓ యాడ్ షూటింగ్ లో గాయాలు అయ్యాయి అని అతని టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.(NTR)
అయితే ఎన్టీఆర్ కి గాయం వల్ల ఆ యాడ్ షూటింగ్ మధ్యలో వదిలేయడంతో దాన్ని పూర్తిచేసేశాడట. గాయంతోనే ఇంకా పూర్తిగా తగ్గకముందే వచ్చి షూటింగ్ చేసాడట ఎన్టీఆర్.
Also Read : OG Mania : ఎల్లుండి రిలీజ్.. అప్పుడే మొదలైన OG సంబరాలు.. అది కూడా మల్టీప్లెక్స్ దగ్గర.. వీడియో వైరల్..
ఈ యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఒక స్టూడియోలో సెట్ వేసి ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ రికవరీ అయ్యే వరకు స్టూడియోలో సెటప్ అంతా అలా ఉంచితే రెంట్ పెరుగుతుంది. టీం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, దీంతో ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆ వాణిజ్య సంస్థకు కూడా యాడ్ లేట్ అవుతుంది. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గాయం తగ్గకపోయినా ఎన్టీఆర్ షూటింగుకు వెళ్లారట. నొప్పిని భరిస్తూనే ఎన్టీఆర్ ఆ యాడ్ కంప్లీట్ చేసారని తెలుస్తుంది.
దీంతో ఎన్టీఆర్ డెడికేషన్, వర్క్ పట్ల కమిట్మెంట్ చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్, ఎన్టీఆర్ టీమ్, ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఆ యాడ్ షూట్ అయిపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాకే మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ జరుగుతుంది.
Also Read : Anaconda : ‘అనకొండ’ మళ్ళీ వచ్చేస్తుంది.. ఈసారి సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్ రిలీజ్..