OG Mania : ఎల్లుండి రిలీజ్.. అప్పుడే మొదలైన OG సంబరాలు.. అది కూడా మల్టీప్లెక్స్ దగ్గర.. వీడియో వైరల్..

పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే థియేటర్స్ దగ్గర ఏ రేంజ్ లో సందడి ఉంటుందో తెలిసిందే. (OG Mania)

OG Mania : ఎల్లుండి రిలీజ్.. అప్పుడే మొదలైన OG సంబరాలు.. అది కూడా మల్టీప్లెక్స్ దగ్గర.. వీడియో వైరల్..

OG Mania

Updated On : September 23, 2025 / 9:52 PM IST

OG Mania : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఏ సినిమాకు లేనంత హైప్ OG కి ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ వచ్చిన తీరు, మాట్లాడిన తీరు ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాయి. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని అయిపోయాయి.(OG Mania)

ఆన్లైన్ లో OG టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే థియేటర్స్ దగ్గర ఏ రేంజ్ లో సందడి ఉంటుందో తెలిసిందే. థియేటర్స్ దగ్గర కటౌట్స్, బ్యానర్స్, పాలాభిషేకాలు, ఫ్యాన్స్ హంగామా.. అబ్బో మామూలు రచ్చ ఉండదు. ఎల్లుండి రిలీజ్ అంటే OG సినిమాకు పవన్ ఫ్యాన్స్ ఇప్పుడే హడావిడి మొదలుపెట్టేసారు. అది కూడా సింగిల్ స్క్రీన్ దగ్గర కాదు ఏకంగా మల్టీప్లెక్స్ దగ్గర.

Also Read : Pawan Kalyan : OG రిలీజ్ కి ముందు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు..

హైదరాబాద్ లోని ఫేమస్ మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమ్యాక్స్ దగ్గర పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి భారీ దండ వేసి, ఫైర్ క్రాకర్స్ తో గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఎల్లుండి రిలీజ్ అయినా రెండు రోజుల ముందు నుంచే OG సంబరాలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గరికి నేడు భారీగా పవన్ ఫ్యాన్స్ తరలి వచ్చి ఈ కటౌట్ ఓపెనింగ్ తో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Prasads Multiplex (@prasadsmultiplx)