Anaconda : ‘అనకొండ’ మళ్ళీ వచ్చేస్తుంది.. ఈసారి సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్ రిలీజ్..

ఈ క్రమంలో అనకొండ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. (Anaconda)

Anaconda : ‘అనకొండ’ మళ్ళీ వచ్చేస్తుంది.. ఈసారి సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్ రిలీజ్..

Anaconda

Updated On : September 23, 2025 / 9:15 PM IST

Anaconda : ఒకప్పుడు వచ్చిన హాలీవుడ్ అనకొండ సినిమాల సిరీస్ పెద్ద హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను అనకొండతో భయపెట్టారు. ఇప్పుడు మళ్ళీ అనకొండ వస్తుంది. ఈ సారి భయం కాకుండా సస్పెన్స్ తో పాటు కామెడీని కూడా జోడించారు.(Anaconda)

పాల్ రుడ్, జాక్ బ్లాక్ ముఖ్య పాత్రల్లో అనకొండ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మాణంలో టామ్ గోర్మికన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఇండియాలో కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అనకొండ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read : Pawan Kalyan : OG రిలీజ్ కి ముందు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు..

మీరు కూడా అనకొండ ట్రైలర్ చూసేయండి..

 

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఇద్దరు ఫ్రెండ్స్ డగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రుడ్) తమ అభిమాన పాత అనకొండ సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు. ఇందుకోసం అమెజాన్ అడవికి డూప్లికేట్ చిన్న అనకొండని తీసుకెళ్తారు. కానీ అది మిస్ అయి నిజంగానే భారీ అనకొండ ఎదురవడంతో అప్పటి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్ళు ఎలాంటి పాట్లు పడ్డారు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది.

Also See : National Awards : నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే..