NTR Devara Movie Released 100 Days Special Posters and Centers Details
Devara 100 Days : ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో జాన్వీకపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా తెరకెక్కింది దేవర సినిమా. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజయి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ బాగానే సాధించి హిట్ అయింది. ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
Also Read : Ram Charan – Naharika : అన్నతో పోటీగా చెల్లి.. చరణ్ గేమ్ ఛేంజర్ కి పోటీగా నిహారిక సినిమా సంక్రాంతి బరిలో..
దేవర సినిమా 52 సెంటర్స్ లో 50 రోజులు ఆడి ఇటీవల 50 రోజులు ఆడిన సినిమాల్లో మంచి రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు దేవర సినిమా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దేవర మూవీ యూనిట్ నుంచి 100 డేస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే దేవర 100 రోజులు ఆరు సెంటర్స్ లో ఆడుతుందని ప్రకటించారు.
ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, కల్లూరు MNR థియేటర్, రొంపిచర్ల MM డీలక్స్ థియేటర్ లలో దేవర సినిమా 100 డేస్ ఆడినట్టు ప్రకటించారు.
దేవర 100 డేస్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ దేవర సినిమా నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసి సినిమా చివర్లో లీడ్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర 2 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అదయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా మొదలుకానుంది.
The 'X' mark of #Devara stands unshakable with your love ❤️
100 days since the fearless waves hit the screens 🔥 pic.twitter.com/YKEXFti0Mb
— Devara (@DevaraMovie) January 4, 2025