Ram Charan – Naharika : అన్నతో పోటీగా చెల్లి.. చరణ్ గేమ్ ఛేంజర్ కి పోటీగా నిహారిక సినిమా సంక్రాంతి బరిలో..
అన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు నిహారిక సినిమా పోటీ ఇవ్వనుంది.

Niharika Madraskaaran Movie Fight with Ram Charan Game Changer in Tamilanadu for Pongal
Ram Charan – Naharika : రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు తెలుగులో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. తమిళ్ లో అజిత్ సినిమా పోటీ ఉంటుంది అనుకుంటే చివరి నిమిషంలో అజిత్ సినిమా వాయిదా వేశారు.
Also Read : Game Changer Trailer Views : అదరగొట్టిన గేమ్ ఛేంజర్ ట్రైలర్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?
దీంతో తమిళ్ లో గేమ్ ఛేంజర్ సినిమాకు బాగానే కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే అజిత్ సినిమా వాయిదా పడటంతో పలు చిన్న సినిమాలు తమిళ్ లో సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఈ క్రమంలో నిహారిక హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా కూడా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ నాడు జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు. నిహారిక హీరోయిన్ గా, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
నిహారిక హీరోయిన్ గా తమిళ్ లో నటించిన మద్రాస్ కారన్ సినిమా కూడా జనవరి 10న రిలీజ్ కానుంది. షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా నిహారిక కొణిదెల, ఐశ్వర్య దుత్త హీరోయిన్స్ గా ఈ ‘మద్రాస్ కారన్’ సినిమా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీంతో తమిళనాడులో అన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు నిహారిక మద్రాస్ కారన్ సినిమా పోటీ ఇవ్వనుంది. మరి ఈ రెండు సినిమాల్లో అక్కడి ప్రేక్షకులు ఏది మెచ్చుతారో చూడాలి.
ఇప్పటికే మద్రాస్ కారన్ సినిమా నుంచి ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ఓ రీమేక్ సాంగ్ లో నిహారిక చాలా బోల్డ్ గా నటించడం ఇటీవల బాగా వైరల్ అయింది. ఇక దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజయి అంచనాలు పెంచాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నేడు ఘనంగా జరగనుంది. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తుండటంతో ఈవెంట్ పై, సినిమాపై మంచి హైప్ పెరిగింది.