Devara Collections : దేవర మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి..?
శుక్రవారం దేవర రిలీజ్ అవ్వగా మూడు రోజులు వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది దేవర సినిమా.

NTR Devara Movie Three Days World Wide Gross Collections Details Here
Devara Collections : ఎన్టీఆర్ దేవర సినిమా గత మూడు రోజులుగా థియేటర్స్ లో సందడి చేస్తుంది. శుక్రవారం దేవర రిలీజ్ అవ్వగా మూడు రోజులు వీకెండ్ లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది దేవర సినిమా. మొదటి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిన దేవర సినిమా రెండో రోజు 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నిన్న ఆదివారం మూడో రోజు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
Also Read : NTR – Politics : పాలిటిక్స్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఓటర్లుగా మారరు..
మొత్తంగా దేవర సినిమా మూడు రోజుల్లో 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. దేవర సినిమాకు దాదాపు 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. ఇంకో 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవర బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే.
మరో రెండు రోజుల్లో దేవర బ్రేక్ ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు మూవీ యూనిట్. ఇక మరో రెండు రోజుల్లో దసరా సెలవులు మొదలవుతుండటంతో దేవర ఈజీగా 500 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
A hurricane named #Devara…
has wiped out every nook and corner with his 'X' style of destruction 🔥🔥#BlockbusterDevara pic.twitter.com/YiISj6swf2— Devara (@DevaraMovie) September 30, 2024