NTR – Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగతో ‘దేవర’.. స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో చూశారా?

తాజాగా సందీప్ రెడ్డి వంగతో దేవర మూవీ యూనిట్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమోని విడుదల చేసారు.

NTR Devara Movie Unit Special Interview with Sandeep Reddy Vanga Promo Released

NTR – Sandeep Reddy Vanga : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఇటీవల ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బాలీవుడ్ లో ప్రమోషన్స్ కోసం కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు చేసారు. అయితే ముంబై నుంచి ఎన్టీఆర్ అనేక ఫోటోలు వైరల్ అవ్వగా అందులో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఉన్న ఓ ఫోటో బాగా వైరల్ అయింది. ఈ ఫోటో చూసి సందీప్ వంగతో దేవర ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించింది.

Also Read : Tollywood Stars : ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా..? ఒకరు హీరో, ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్.. చిన్నప్పుడు సీరియల్‌లో..

తాజాగా సందీప్ రెడ్డి వంగతో దేవర మూవీ యూనిట్ చేసిన ఇంటర్వ్యూ ప్రోమోని విడుదల చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో దేవర కోసం ఎంత కష్టపడ్డారు, షూటింగ్ గురించి, సినిమా లెంగ్త్.. ఇలా చాలా అంశాలు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఫుల్ ఇంటర్వ్యూ వస్తే దేవర గురించి బోలెడు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి దేవర మూవీ యూనిట్ తో సందీప్ రెడ్డి వంగ చేసిన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..