Tollywood Stars : ఈ క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా..? ఒకరు హీరో, ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్.. చిన్నప్పుడు సీరియల్లో..
ఈ ఫొటోలో ఉన్న క్యూట్ పిల్లలు ఇద్దరూ ఇప్పుడు ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.

These Cute Children now Hero and Music Directors Find Them
Tollywood Stars : ఈ ఫొటోలో ఉన్న క్యూట్ పిల్లలు ఇద్దరూ ఇప్పుడు ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు ఎవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ సంగీత దర్శకులు కీరవాణి తనయులు శ్రీ సింహ, కాల భైరవ. ఇద్దరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి చిన్నప్పుడు ఓ సూపర్ హిట్ సీరియల్ లో కూడా నటించారు.
కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీ సింహ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహ తాజాగా నిన్నే మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మత్తు వదలరా 2 సినిమాలో శ్రీ సింహ హీరోగా నటిస్తే కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసాడు. మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహ హీరోగా మారితే, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా మారడం గమనార్హం.
Also Read : Mathu Vadalara 2 : అదరగొట్టిన మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
శ్రీ సింహ, కాలభైరవ ఇద్దరు కలిసి చిన్నప్పుడు ఓ సీరియల్ లో కనిపించారు. అదేం సీరియల్ అనుకుంటున్నారా? మనందరికీ ఫేవరేట్ సీరియల్ అయిన అమృతం. అమృతం సీరియల్ లో 12వ ఎపిసోడ్ లో కొంతమంది పిల్లలతో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో కాలభైరవ, శ్రీ సింహ ఇద్దరు కనిపిస్తారు. చిన్నప్పుడు ఇద్దరూ భలే క్యూట్ గా ఉన్నారు. ఆ సీన్ లోని వీరిద్దరి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక శ్రీ సింహ చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో కూడా నటించి అలరించాడు. ఇప్పుడు శ్రీ సింహ హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.