Mathu Vadalara 2 : అదరగొట్టిన మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
సస్పెన్స్ క్రైం కామెడీగా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సినిమా థియేటర్స్ లో ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించి మెప్పిస్తుంది.

Sri Simha Satya Mathu Vadalara 2 First Day Collections
Mathu Vadalara 2 Collections : 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా నిన్న సెప్టెంబర్ 13న థియేటర్స్ లో రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కగా శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్, రోహిణి, వెన్నెల కిషోర్, అజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
Also See : బిగ్ బాస్ శుభశ్రీ, రోల్ రైడా స్పెషల్ సాంగ్ చూశారా.. కాకినాడ కాజా తినిపించేస్తాడంట..
సస్పెన్స్ క్రైం కామెడీగా తెరకెక్కించిన మత్తు వదలరా 2 సినిమా థియేటర్స్ లో ఫుల్ గా ప్రేక్షకులని నవ్వించి మెప్పిస్తుంది. ముఖ్యంగా కమెడియన్ సత్య అయితే ఈ సినిమాని ముందుండి నడిపించాడు, తన కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు ప్రేక్షకులని. దీంతో చిన్న సినిమా అయినా మంచి విజయం దక్కింది. మొదటి రోజు మత్తు వదలరా 2 సినిమా ఏకంగా 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక నేడు, రేపు వీకెండ్ ఉండటంతో ఈజీగా 15 కోట్ల పైన కలెక్ట్ చేసి ఈ సినిమా భారీ ప్రాఫిట్స్ తో సూపర్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి మత్తు వదలరా పార్ట్ 1కి మించి పార్ట్ 2 హిట్ అవుతుంది.
#MathuVadalara2 begins on a SUPER HIGH note at the Box Office 💥💥
Grosses 5.3 CRORES on Day 1 💰
Sensational weekend loading 🔥Book your tickets now for the HELARIOUS BLOCKBUSTER THRILLER now 💥💥
🎟️ https://t.co/2KCkNRSxXU#BlockbusterMathuvadalara2
A @RiteshRana sequel.… pic.twitter.com/yj1OtSqGsE
— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2024