NTR Devara Target Huge Collections in Telugu States for Break Even
Devara Target : ఎన్టీఆర్ దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక దేవర సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల థియేట్రికల్ సేల్ జరిగిపోయిందని, ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. తాజాగా సమాచారం ప్రకారం తెలుగులో దేవర సినిమాకు భారీ బిజినెస్ జరిగిందట. నైజాంలో 42 కోట్లకు, ఆంధ్రలో 55 కోట్లకు, సీడెడ్ లో 20 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయని సమాచారం.
Also Read : NTR – Alia Bhatt : ఒరే బాబు.. నేను ‘దేవర’లో నటించలేదు.. అలియా భట్ కామెంట్స్..
ఈ లెక్కన తెలుగులో దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 120 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 240 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేస్తే కానీ దేవర తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ అవుతుంది. ఇక హిట్ అవ్వాలంటే కనీసం 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. మరి దేవర ఈ రేంజ్ లో తెలుగులో కలెక్షన్స్ రాబడుతుందా చూడాలి.