Shruti Marathe : ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? యంగ్, ముసలి పాత్రల్లో..

'వర'కు జంటగా జాన్వీ కపూర్ ఉండగా 'దేవర'కు జంటగా శృతి మరాఠి నటించింది.

NTR Devara Wife Character Actress Shruti Marathe Details Here

Shruti Marathe : దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి, కొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ‘వర’కు జంటగా జాన్వీ కపూర్ ఉండగా ‘దేవర’కు జంటగా శృతి మరాఠి నటించింది.

శృతి మరాఠీ గుజరాత్ కి చెందిన అమ్మాయి. మరాఠీ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. గతంలో తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. శృతి మరాఠి కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా కనిపించింది. ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ లలో కూడా ఛాన్సులు తెచ్చుకుంటుంది. ఈమె గౌరవ్ ఘటనేకర్ అనే నటుడిని 2016 లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది శృతి మరాఠి. దేవర సినిమాలో ఎన్టీఆర్ చేసే తండ్రి పాత్రకు భార్యగా నటించింది. దీంతో రెండు లుక్స్ లో కనిపించింది. యంగ్ పాత్రలో, ముసలి పాత్రలో శృతి మరాఠీ దేవరలో కనిపించబోతుంది. అంటే ఒక ఎన్టీఆర్ కి భార్యగా, ఇంకో ఎన్టీఆర్ కి తల్లిగా కనిపించబోతుంది.

Also Read : Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హోటల్ ధ్వంసం.. ఫ్యాన్స్ చేసిన రచ్చ వల్ల ఏకంగా అన్ని లక్షల నష్టం..

ఇటీవల ప్రమోషన్స్ లో కొరటాల శివ మాట్లాడుతూ.. దేవర భార్య పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్, ఎక్కువ అంచనాలు లేని నటిని తీసుకోవాలనుకున్నాం అందుకే శృతి మరాఠిని తీసుకున్నాం అని తెలిపారు. శృతి కూడా దేవరలో చేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ గా ఈ సినిమా గురించి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం దేవరలోని తన యంగ్, ముసలి లుక్స్ తో దిగిన సెల్ఫీలు కొన్ని పోస్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత శృతి మరాఠీకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉండొచ్చు.