NTR – Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. కానీ నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

ఛావా సినిమా తెలుగులో మార్చ్ 7న రిలీజ్ కానుంది.

NTR Fans Disappointed with Chhaava Telugu Release

NTR – Chhaava : ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా ఇటీవల ఫిబ్రవరి 14న హిందీలో రిలీజయి భారీ విజయం సాధించింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అదరగొట్టేసాడు. రష్మిక మందన్న శంభాజీ భార్య పాత్రలో నటించింది. ఛావా సినిమా హిందీలో పెద్ద హిట్ అయి ఇప్పటికే 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా దూసుకుపోతుంది.

అయితే మొదట ఛావా సినిమా హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ వర్షన్ రిలీజ్ చేయగా ఇప్పటికే కొంతమంది ఈ సినిమాని చూసి అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఛావా సినిమాకు డిమాండ్ ఉండటంతో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గీత్ ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఛావా సినిమా తెలుగులో మార్చ్ 7న రిలీజ్ కానుంది.

Also Read : Hometown web series : ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘హోం టౌన్’ వెబ్ సిరీస్.. ఎప్ప‌టి నుంచంటే?

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ బాగుంది, ప్రేక్షకులు శంభాజీ జీవిత చరిత్రను చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఛావా సినిమాలో విక్కీ కౌశల్ పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారని వార్తలు వచ్చాయి. హిందీలో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి శంభాజీ పాత్రలో విక్కీ అద్భుతంగా డబ్బింగ్ చెప్పాడు. డైలాగ్స్ లో కూడా పవర్ ఫుల్ ఎమోషన్ కనిపించింది. దీంతో తెలుగులో అంతే పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పాలంటే ఎన్టీఆర్ వల్లే అని, ఎన్టీఆర్ ఆల్రెడీ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ శంభాజీ పాత్రకే కాదు అసలు ఏ పాత్రకు డబ్బింగ్ చెప్పలేదని తెలిసిపోయింది. తెలుగు డబ్బింగ్ లో శంభాజీ పాత్రకు చెప్పిన డబ్బింగ్ అంత పవర్ ఫుల్ గా లేదని పలువురు ట్రైలర్ కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇంత మంచి సినిమాకు పవర్ ఫుల్ వాయిస్ ఉంటే బాగుండేదని, ఎన్టీఆర్ చెప్తే బాగుండేదని అంటున్నారు. దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమా రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు థియేటర్ లో ఎన్టీఆర్ వాయిస్ అయినా వినొచ్చు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఛావాలో ఎన్టీఆర్ వాయిస్ లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Also Read : Kiran Abbavaram : మార్కెట్ లో ఎక్కడా దొరకని బైక్.. మీకు కావాలా? అయితే కిరణ్ అబ్బవరం చెప్పిన పని చేయండి..