Hometown web series : ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘హోం టౌన్’ వెబ్ సిరీస్.. ఎప్పటి నుంచంటే?
మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్ హోం టౌన్.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. వైవిధ్యమైన, ఇంటిల్లిపాది కూర్చొని చక్కగా చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా మరో వెబ్ సిరీస్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది.
మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో రూపుదిద్దుకున్న హోం టౌన్ వెబ్‌సిరీస్‌తో అలరించనుంది. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెరకెక్కింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
‘పెళ్లి కానీ ప్రసాద్’ టీజర్ చూశారా? కట్నం క్యాష్ గానే కావాలి.. ఆన్లైన్ అయితే ట్యాక్స్ కట్టాలంట..
The Paradise glimpse : అదిరిపోయిన నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్.. ఇది కడుపు మండిన కాకుల కథ.
ఏప్రిల్ 4 నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు కానుంది. ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.