NTR : వాళ్లందరికి స్పెషల్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ కోసం వచ్చిన అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్..

తాజాగా బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు.

NTR hosts special party to Tollywood Famous persons and Amazon International VP James attended

NTR :  ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్(NTR) కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30వ(NTR 30) సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో కూడా సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా ఎన్టీఆర్ ఓ స్పెషల్ పార్టీ నిర్వహించాడు.

కారణం ఏంటో తెలీదు కానీ తాజాగా బుధవారం (ఏప్రిల్ 12) రాత్రి ఎన్టీఆర్ తన ఇంట్లో ఓ స్పెషల్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. ఈ పార్టీకి తనకు సినీ పరిశ్రమలో బాగా క్లోజ్ గా ఉండే పలువురిని ఆహ్వానించాడు. ఈ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాత శిరీష్, మైత్రి సంస్థ నిర్మాతలు, శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు కార్తికేయ, మరికొంతమంది ప్రముఖులు విచ్చేశారు. ఇదే పార్టీకి అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ కూడా విచ్చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Vishakha Singh : హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. పోరాడుతున్నాను అంటూ పోస్ట్..

ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను. ముఖ్యంగా జేమ్స్, ఎమిలీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మంచి మాటలకు, పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఎన్టీఆర్ పార్టీ ఎందుకు ఇచ్చాడు, ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్టీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.