NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 క్లైమాక్స్ మార్చారా? లేదా ఆ సినిమా కోసమా?

బాలీవుడ్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమాలో క్లైమాక్స్ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మార్చారట. (NTR)

NTR

NTR : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వీకెండ్ లో ఈ సినిమా కేవలం 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. యాక్షన్స్ తో ప్రేక్షకులను మెప్పించినా కథ, కథనం మాత్రం రొటీన్ గా ఉండటంతో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి సారి ఎన్టీఆర్(NTR) బాలీవుడ్ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగులో.

అయితే తాజాగా బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో క్లైమాక్స్ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మార్చారట. ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఈ సినిమాకు నేను ఒప్పుకోలేదని, కానీ నిర్మాత ఆదిత్య చోప్రా నా వెనక తిరిగి, నా ఫ్యాన్స్ కి నచ్చేలా చేస్తామని చెప్పి ఒప్పించాడని తెలిపారు.

Also Read : Prabhas Anushka : 8 ఏళ్ళ తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి..? అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే.. సినిమా కాదు కానీ స్పెషల్..

వార్ 2 క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పాత్ర చనిపోయినట్టు చూపిస్తారు. సినిమా కథ ప్రకారం అయితే ఆ పాత్ర చనిపోవడం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ సినిమా అయ్యాక ఎన్టీఆర్ మళ్ళీ బతికినట్టు, చనిపోయాడని అబద్దం చెప్పినట్టు చూపించి ఎన్టీఆర్ – హృతిక్ కలిసి కొన్ని ఆపరేషన్స్ చేసినట్టు చివర్లో చూపించారు.

మన తెలుగులో హీరో చనిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరని తెలిసిందే. గతంలో చాలా సినిమాల్లో హీరో చనిపోవాలి కానీ ఫ్యాన్స్ కోసమే క్లైమాక్స్ ని మార్చారు. ఇప్పుడు వార్ 2 లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసమే క్లైమాక్స్ ని మార్చారని, ఎన్టీఆర్ మళ్ళీ బతికినట్టు చూపించారని తెలుస్తుంది. మొదట ఎన్టీఆర్ కి కథ చెప్పినపుడు ఎన్టీఆర్ పాత్ర చనిపోతుందనే చెప్పారట. కానీ తర్వాత కథ మార్పుల్లో ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం క్లైమాక్స్ ని మార్చారట.

Also Read : Nikhil Abburi : ప్రభాస్, నాగచైతన్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ.. ఈ బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి..

అయితే బాలీవుడ్ YRF స్పై యాక్షన్ సినిమాల్లో ఎన్టీఆర్ కి సోలో సినిమా ఉందని వార్తలు వచ్చాయి. వార్ 2 చివర్లో కూడా ఎన్టీఆర్ సోలో సినిమా ఉంటుందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ సోలో సినిమా కోసం వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్రని బతికినట్టు చూపించారని తెలుస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది నిజమో కానీ ఎన్టీఆర్ పాత్రపై, ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్స్ పై ఫ్యాన్స్ అయితే సంతృప్తిగానే ఉన్నారు.