Ntr- Shankar: డైరెక్టర్ శంకర్ తో ఎన్టీఆర్ మూవీ.. అంతా సెట్.. కానీ, లాస్ట్ లో ఊహించని ట్విస్ట్
ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Ntr- Shankar).
NTR interest in doing a film with Director Shankar.
- ఎన్టీఆర్- శంకర్ కాంబోలో మూవీ
- గతంలో ఇంట్రెస్ట్ చూపించిన తారక్
- ఇప్పుడు శంకర్ రెడీగా ఉన్నా నో ఛాన్స్
Ntr- Shankar: ఇండియా లెవల్లో స్టార్ హీరో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్, దేవర లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఇక, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ కంటెంట్ కు కమర్షియల్ హంగులు అద్దుతూ భారీ సినిమాలు చేయడంలో ఆయన టాప్.
అలాంటిది, ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆ అంచనాలు ఊహకు కూడా అందడం లేదు కదా. అయితే, ఈ ఇద్దరు కలిసి గతంలో ఒక సినిమా చేయాలనీ అనుకున్నారట. కెరీర్ మొదట్లో ఎన్టీఆర్, శంకర్(Ntr- Shankar) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని బలంగా కోరుకున్నారట. శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అప్పట్లో విశ్లేషణలు సాగాయి.
Mrunal Thakur: క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఘాటు అందంతో చెంపేస్తోందిగా.. ఫొటోలు
ఎన్టీఆర్ కూడా పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఇద్దరి కాల్షీట్లు కుదరకపోవడంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్, ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ, ఎన్టీఆర్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్ గత సినిమాలు అంతగా ఇంపాక్ట్ చూపించకపోవడమే అని తెలుస్తోంది.
ఆయన, గతేడాది రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాబట్టి, ఆయనతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. మరోవైపు, ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
