Anni Manchi Sakunamule: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ట్రైలర్.. ఇకపై నిజంగానే ‘అన్నీ మంచి శకునములే’..!

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Anni Manchi Sakunamule: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ట్రైలర్.. ఇకపై నిజంగానే ‘అన్నీ మంచి శకునములే’..!

NTR Launches Anni Manchi Sakunamule Trailer

Updated On : May 12, 2023 / 7:29 PM IST

Anni Manchi Sakunamule: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), అందాల భామ మాళవిక నాయర్(Malavika Nair) జంటగా, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Anni Manchi Sakunamule : అన్నీ మంచి శకునములే సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చక్కటి చల్లగాలిలా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో పాటు క్యూ్ట్ లవ్ స్టోరీని మనకు ఈ సినిమాలో చూపిస్తున్నారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్‌ల మధ్య కెమిస్ట్రీ మనల్ని పూర్తిగా మెస్మరైజ్ చేయనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమువుతోంది. ఇక సినిమాలోని సెంటిమెంట్ సీన్స్ ఈ సమ్మర్‌లో ఆడియెన్స్‌కు బాగా నచ్చుతాయని ఈ ట్రైలర్ చెబుతోంది.

Anni Manchi Shakunamule : అన్ని మంచి శకునములే ప్రెస్ మీట్ గ్యాలరీ..

ఈ సినిమాను నందిని రెడ్డి తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఇంప్రెస్ చేయబోతుందని ట్రైలర్‌తోనే కన్ఫం అయ్యింది. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సాంగ్స్, మ్యూజిక్ అదనపు బలంగా మారనున్నాయి. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్ ప్రడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మే 18 వరకు వెయిట్ చేయాల్సిందే.